Kadapa: హెల్మెట్ తప్పనిసరి – ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఎస్పీ కఠిన హెచ్చరిక

Kadapa: కడప జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు. 303 కేసులు నమోదు చేసి రూ.72,899 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడి.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 23 Aug 2026 11:54 PM IST
Kadapa
X

Kadapa: హెల్మెట్ తప్పనిసరి – ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై ఎస్పీ కఠిన హెచ్చరిక

కడప: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ తెలిపారు.

ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 303 కేసులు నమోదు చేసి, రూ. 72,899 జరిమానా విధించడం జరిగిందని జిల్లా ఎస్.పి గారు తెలిపారు.

ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో వెళ్లే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని జిల్లా ఎస్.పి గారు సూచించారు.

రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రమాదకరమని , రాంగ్ రూట్ డ్రైవింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story