Kadapa: PGRS ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: ఎస్పీ షెల్కే
Kadapa: కడప ఎస్పీ కార్యాలయంలో PGRS కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ 197 అర్జీలు స్వీకరించి, వాటిని గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Kadapa: PGRS ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: ఎస్పీ షెల్కే
PGRS ఫిర్యాదులను చట్ట పరిధిలో నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలి
– జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్
వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు పాల్గొని, జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 197 ఫిర్యాదులు PGRS కు వచ్చాయి.
* పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం.
* ప్రజల నుండి అందిన సదరు ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు..
కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) శ్రీ కె. ప్రకాష్ బాబు గారు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్ గారు, డి.టి.సి డి.ఎస్పీ శ్రీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.




