Kadapa: కడప పోలీస్ గ్రీవెన్స్‌లో 181 ఫిర్యాదులు

Kadapa: కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ 181 ఫిర్యాదులు స్వీకరించి, సత్వర పరిష్కారానికి ఆదేశించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 12 Oct 2026 4:59 PM IST
Kadapa
X

Kadapa: కడప పోలీస్ గ్రీవెన్స్‌లో 181 ఫిర్యాదులు

కడప: ప్రజా ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై ఎస్పీకి మొత్తం 181 ఫిర్యాదులు అందజేశారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ.. సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు.

ఫిర్యాదుల్లోని చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి.. నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల సమస్యలను సానుభూతితో విని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, చట్ట పరిధిలో పరిష్కరించగల ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA