Kadapa: రేపే ఏపీలో విద్యాసంస్థల బంద్ కడపలో విద్యార్థి సంఘాల పిలుపు!

Kadapa: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. రేపు ఏపీవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు కడపలో విద్యార్థి సంఘాల పిలుపు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 23 July 2026 4:13 PM IST
Kadapa
X

Kadapa: రేపే ఏపీలో విద్యాసంస్థల బంద్ కడపలో విద్యార్థి సంఘాల పిలుపు!

Kadapa: కేంద్ర ప్రభుత్వ విద్యార్థుల పై చేసిన నిరంకుశ విధానాలకు వ్యతిరేఖంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలానే డిమాండ్ తో జరిగే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘం నాయకుడు పిలిపునిచ్చారు. కడప ప్రెస్ క్లబ్లో 24 లో తేదీన విద్యాసంస్థల బంద్, నిరసనలపై విద్యార్థి సంఘాలు సమావేశం అయ్యాయి.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకుడు మాట్లాడుతూ నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కి భాద్యత వహిస్తూ దర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. ఆరు లక్షలకు పైగా విద్యార్థులు రాత్రపగల్లు చదువుకొని పరీక్ష రాసిన విద్యార్థులకు ఆశబంఘం కలిగిందాని లీకేజి పేరుతో విద్యా శాఖ మంత్రి మాత్రం ఏమి తెలియనట్లు వ్యవహరించరని దానికి కేంద్రం కూడా మద్దతుగా ఉందన్నారు.

ఈ లీకేజి వలన చాలా మంది విద్యార్థులు మనోవేదన తో ఆత్మ హత్యలు చేసుకున్నారున్నారు. ఇదేమని ప్రశ్నిస్తు ఢిల్లీ లో విద్యార్థులు ఆందోళనలు చేసిన వారిపై గుండాయిజం చేస్తూ కేంద్రం విద్యార్థులపైన దాడులు చేసిందన్నారు. అనేకమంది పైన కేసులు పెట్టిందన్నారు.

దీనిపైన దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న కేంద్రం సిగ్గు లేకుండా ప్రవర్తిస్తూ, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అందుకోసమనే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాల బంద్ కు పిలుపునిచ్చాయన్నారు . దీనికి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్ కు సహకరించాలని కోరారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story