Kadapa: భూ వివాదంపై మాలేపల్లి శివరాం నాయుడు కుటుంబం ప్రెస్ మీట్!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా సుండుపల్లిలో భూ వివాదం రాజకీయ రంగు పులుముకుంది.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 Jun 2026 8:37 AM IST
Kadapa
X

Kadapa: భూ వివాదంపై మాలేపల్లి శివరాం నాయుడు కుటుంబం ప్రెస్ మీట్!

Kadapa: తమ కుటుంబ సభ్యులకు వస్తున్న సర్వే నెంబర్ 2021/బి,10 సెంట్ల స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని తమపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మాలేపల్లి శివరాం నాయుడు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సుండుపల్లి మండల కేంద్రంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుండుపల్లి మండల కేంద్రంలో వారసత్వంగా 10 సెంట్లు తమ అనుభవంలోనే ఉందని, తమ కుటుంబ సభ్యులు ప్రమేయం లేకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని సెటిల్మెంట్ కింద డబ్బులు ఇవ్వాలని సావిత్రమ్మ కుటుంబ సభ్యులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు వారు ఆరోపించారు.

పార్టీ పెద్దలకు, సుండుపల్లి ప్రజలకు సోసియల్ మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాజంపేట ఇంచార్జి జగన్మోహన్ రాజు పై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఇది కేవలం తమ కుటుంబ సమస్య మాత్రమే, రాజకీయ సమస్య కాదని కొంత మంది ఉద్దేశ పూర్వకంగానే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.

మాధ్యమాలలో ప్రచారం చేసే వారు కూడా వాస్తవాలను గ్రహించి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.తమకు న్యాయం చేయాలని ఇటీవలే పి జి ఆర్ ఎస్ ద్వారా కలెక్టర్ ను కోరినట్లు బాధితులు తెలిపారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story