Kadapa: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం.. చివరికి మోసం?

Kadapa: కడపలో ‘తాహర్ పిక్చర్ ప్యాలెస్’ లక్కీ డిప్ కలకలం రేపుతోంది. కేవలం రూ. 1000 కే థియేటర్, 30 సెంట్ల స్థలం అంటూ ప్రచారం.. ఆ తర్వాత డిప్ రద్దు చేశారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 17 July 2026 9:21 AM IST
Kadapa
X

Kadapa: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ప్రచారం.. చివరికి మోసం?

కడప: రూ.1000తో థియేటర్, 30 సెంట్ల స్థలం అంటూ కడప లో లక్కీ డిప్. 'తహర్ పిక్చర్ ప్యాలెస్' పేరుతో భారీ ప్రచారం. ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన థియేటర్ యజమాని. మార్చి 29న డిప్ ఓపెన్ చేసి విజేత ప్రకటిస్తామని నిర్వాహకుల హామీ.

పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రచారం. అనంతరం లక్కీ డిప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటన. అందరికీ డబ్బులు తిరిగి ఇస్తామని నిర్వాహకుల వెల్లడి. ఇప్పటికీ చాలామందికి రీఫండ్ అందలేదని బాధితుల ఆరోపణ. పోస్టర్‌లోని ఫోన్ నంబర్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నాయని ఫిర్యాదు.

నిర్వాహకుల నుంచి స్పందన లేదని బాధితుల ఆవేదన. డబ్బులు ఎలా తిరిగి పొందాలనే అయోమయంలో వేలాది మంది ప్రజలు. థియేటర్ అమ్మకం పేరుతో లక్షలాది రూపాయలు దండుకున్న తాహర్ థియేటర్ యజమాని.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story