Kadapa: కడప టెలికాం నగర్‌లో జూదం ఆ స్థావరంపై దాడి 11 మంది అరెస్ట్!
Kadapa: కడప టెలికాం నగర్‌లో జూదం ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసిన రిమ్స్ పోలీసులు. రూ.76,270 నగదు, 10 ఫోన్లు, 5 బైకులు స్వాధీనం.
Kadapa: కడప టెలికాం నగర్‌లో జూదం ఆ స్థావరంపై దాడి 11 మంది అరెస్ట్!
Kadapa: జిల్లా ఎస్.పి. శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. గారి ఆదేశాల మేరకు, కడప డి.ఎస్.పి. శ్రీ బాలస్వామి రెడ్డి గారి సూచనలతో రిమ్స్ సి.ఐ. శ్రీ రాజగోపాల్ ఆధ్వర్యంలో రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్‌లో జూదం ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి రూ.76,270 నగదు, 10 సెల్‌ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జిల్లాలో జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రిమ్స్ సి.ఐ. రాజగోపాల్ తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయం, కడప.
Next Story




