Kadapa: కడప: మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి జరపాలి: విజయ్ భట్టర్!
Kadapa: వినాయక చవితి వేడుకలను వేద సంప్రదాయాలతో, పర్యావరణహితంగా నిర్వహించాలని వైఎస్సార్ కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టర్ విజ్ఞప్తి.
Kadapa: కడప: మట్టి విగ్రహాలతోనే వినాయక చవితి జరపాలి: విజయ్ భట్టర్!
వినాయక చవితి వేడుకలను వేద సంప్రదాయాలతో ఘనంగా నిర్వహించాలి..
జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టర్..
కడప:
వినాయక చవితి మహోత్సవాలను వేద సంప్రదాయాలకు అనుగుణంగా, పర్యావరణహితంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టర్ మండపాల నిర్వాహకులు, అర్చకులకు సూచించారు.
వినాయక విగ్రహాలను వేదోక్త విధానాలను అనుసరించి సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించాలని, మట్టి వినాయక విగ్రహాలనే పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు.
వినాయక చవితి మండపాల్లో ప్రతిరోజూ లోక కళ్యాణం, లోక క్షేమాన్ని కాంక్షిస్తూ వేద పారాయణాలు, ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు. భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు తమ శక్తి మేరకు లక్ష్మీ గణపతి హోమాన్ని నిర్వహించాలని సూచించారు.గణపతి విగ్రహాల ఊరేగింపులను శాస్త్రీయంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భారతీయ సంస్కృతి, సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మండపాల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి, సంస్కృతి, సంప్రదాయ విలువలను పెంపొందించే విధంగా ఉండాలని, ఎటువంటి అశ్లీల, అసభ్య కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకుండా నిర్వాహకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. అలాగే మండపాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేలా భక్తి గీతాలు, వేదఘోషలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు అర్చకులు, పురోహితులు. భక్తులు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో, సామాజిక బాధ్యతతో విజయవంతంగా నిర్వహించాలని విజయ్ భట్టర్ విజ్ఞప్తి చేశారు.




