Kadapa: ఆశపెట్టి మోసం చేశారు.. టీడీపీ నేతలపై బద్వేల్ మహిళల ఆగ్రహం
Kadapa: కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది.
Kadapa: ఆశపెట్టి మోసం చేశారు.. టీడీపీ నేతలపై బద్వేల్ మహిళల ఆగ్రహం
Kadapa: కడప జిల్లా బద్వేల్.. మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు రోడ్డులోని రాఘవేంద్ర గ్రాండ్ నందు మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తమకు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు..
టిడిపి 27.. 28.. తేదీల చేపట్టిన మహానాడు కార్యక్రమానికి హాజరైన మహిళలకు భోజన వసతి, మరియు చీరలు పంపిణీ చేస్తామని చెప్పి తామందరిని మహానాడు కార్యక్రమానికి పిలిపించారని తీర ఇక్కడికి వచ్చిన తర్వాత సరైన సదుపాయాలు లేకపోవడంతో పాటు తమను పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. తాము నిరుపేదలమని ఏదో చీరలు భోజనం వసతి కల్పిస్తే రెండు రోజులు గడుస్తుంది అనే ఉద్దేశంతో వచ్చామని కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాయకులు వారి పార్టీ కార్యక్రమాలు ముగించుకొని మమ్మల్ని ఆశపెట్టి మోసం చేశారని సభా ప్రాంగణంలోనే తమ గోడును వెళ్ళబుచ్చారు.
ఇలా మోసం చేసే నాయకులు ఇంకొకసారి మా ఇళ్ల వద్దకు వచ్చి అవసరం ఉందని చెప్పినప్పుడు వారి సంగతి చెబుతామని నిరోత్సాహంతో వెనుదిరిగినారు. అదే ప్రాంగణంలో ర్యాలీ అనంతరం నిమ్మరసం సరఫరా చేస్తున్న వారిని నిమ్మరసం అడుగగా అది కూడా ప్రాంగణంలోకి వెళ్లి తీసుకోవాలని బయట ఎవరికి ఇచ్చేది లేదని ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని కవరేజ్ చేసే దానికి వచ్చిన జర్నలిస్టులను చెప్పినా కూడా ఎవరైనా సరే ప్రాంగణంలోకి వెళ్లి తీసుకోవాలని అక్కడున్న కొంతమంది నాయకులు ఎవరు ఎవరని తెలియని వారు కూడా ఇలా ప్రవర్తించటం కొంత అసహనానికి గురిచేసింది.




