Kadapa: చిన్నారుల మృతిపై సమగ్ర విచారణ జరపాలి డాక్టర్ నాగార్జున్ రెడ్డి
Kadapa: క్లోరోక్విన్ మాత్రలు వికటించి చిన్నారులు మృతి చెందడంపై వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ వింగ్ విచారణకు డిమాండ్ చేసింది.
Kadapa: చిన్నారుల మృతిపై సమగ్ర విచారణ జరపాలి డాక్టర్ నాగార్జున్ రెడ్డి
కడప: మలేరియా నివారణ పేరుతో చిన్నారులకు క్లోరోక్విన్ మాత్రలు ఇవ్వడంపై వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ వింగ్ కడప జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగార్జున్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా ఎటకుప్ప గ్రామంలో క్లోరోక్విన్ మాత్రలు తీసుకున్న చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురికావడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
క్లోరోక్విన్ మాత్రలు ఏ ప్రోటోకాల్ ప్రకారం పంపిణీ చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డాక్టర్ నాగార్జున్ రెడ్డి కోరారు.మలేరియా అనుమానం ఉంటే ముందుగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాతే సరైన చికిత్స అందించాలన్నది ప్రస్తుత వైద్య విధానమని తెలిపారు.క్లోరోక్విన్ మందుల బ్యాచ్ నాణ్యతను పరీక్షించారా పిల్లల వయస్సు, బరువుకు అనుగుణంగా డోస్ ఇచ్చారా, లేక అందరికీ ఒకే విధంగా మందులు పంపిణీ చేశారా, అనే అంశాలపై విచారణ జరగాలన్నారు.
క్లోరోక్విన్ అధిక మోతాదులో తీసుకుంటే గుండె సంబంధిత దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. మందులు పంపిణీ చేసే సమయంలో అత్యవసర వైద్య సదుపాయాలు, ఈసీజీ మానిటరింగ్ వంటి ఏర్పాట్లు చేశారా అనే దానిపై కూడా అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చిన్నారుల మృతికి, అస్వస్థతకు అసలు కారణాలను నిగ్గు తేల్చి బాధ్యులపైచర్యలు తీసుకోవాలని డాక్టర్ నాగార్జున్ రెడ్డి కోరారు.




