Kadapa: కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నిసార్ అహమ్మద్

Kadapa: కడప పెద్ద దర్గా గంధం ఉత్సవంలో పాల్గొన్న మదనపల్లె వైసీపీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్. వర్షాలు కురవాలని, కరువు తొలగిపోవాలని ప్రత్యేక ప్రార్థనలు.

Srinivasulu, Madanapalle
Published on: 13 Aug 2026 10:59 PM IST
Kadapa
X

Kadapa: కడప పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన నిసార్ అహమ్మద్

కడప: కడప పెద్ద దర్గాలో నిర్వహించిన హజ్రత్ అమీన్ ఉల్లా మాలిక్ గంధం ఉత్సవంలో మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

అల్లాహ్ తాలా సమృద్ధిగా వర్షాలు కురిపించి, కరువు పరిస్థితులు తొలగిపోయేలా కరుణ చూపాలని, ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సంతోషం ప్రసాదించాలని ప్రార్థించారు.

పెద్దలు ఆరిఫుల్లా సాహెబ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన నిసార్ అహమ్మద్ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, సీనియర్ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ యూనస్, కరీం, సాదిక్, నాసిర్ అలీ, జబీ, యాసీన్, జైనూ, సత్తార్, మన్సూర్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story