Kadapa: కడప జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలకవర్గ ముగింపు సమావేశం

Kadapa: వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలకవర్గం ముగింపు సమావేశంలో జడ్పీటీసీలను సన్మానించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపామని చైర్మన్ తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 22 Sept 2026 9:27 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలకవర్గ ముగింపు సమావేశం

Kadapa: జిల్లాను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించామని వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ చైర్మన్ రామ గోవిందరెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలకవర్గం పదవీకాలం ముగింపు సందర్భంగా జడ్పీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు.

కడపలో జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలకవర్గం పదవీకాల ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్, జడ్పీటీసీ సభ్యులను జడ్పీ సీఈఓతో పాటు అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.చివరి సమావేశంలో సభ్యులు తమ ఐదేళ్ల అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

అనంతరం జడ్పీ చైర్మన్ రామ గోవిందరెడ్డి మాట్లాడుతూ... తనకు లభించిన 18 నెలల కాలంలో జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.

జిల్లా పరిషత్ పరిధిలో 154 మందికి పదోన్నతులు కల్పించామని, 47 మందికి కారుణ్య నియామకాలు అందించామని చెప్పారు. పది తాలూకాల్లో సుమారు 72 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, భవనాల నిర్మాణ పనులు చేపట్టామని వెల్లడించారు.

పార్టీలకు అతీతంగా జిల్లా అభివృద్ధినే ధ్యేయంగా పనిచేశామని, తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేశామని రామ గోవిందరెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA