Kalasapadu: కలసపాడులో స్థానిక ఎన్నికలపై సన్నాహక సమావేశం
Kalasapadu: కలసపాడు మండలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బద్వేల్ ఇన్చార్జి, ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి, యువనేత ఆదిత్య రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరిగింది.
Kalasapadu: కలసపాడులో స్థానిక ఎన్నికలపై సన్నాహక సమావేశం
కలసపాడు: కలసపాడు మండలంలో ఈరోజు శనివారం సాయంత్రం 4 గంటలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీ డి.సి. గోవిందరెడ్డి గారు నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గార్లుపాల్గొని ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.




