Kondapuram: కొండాపురంలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై బీజేపీ వినతి
Kondapuram: కొండాపురం మండలం తూర్పు ఎర్రబల్లిలో తీవ్ర తాగునీటి ఎద్దడి, విద్యుత్ స్తంభాల కొరతను పరిష్కరించాలని 'జనతా వారధి' ద్వారా బీజేపీ నేతలు ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.
Kondapuram: కొండాపురంలో తాగునీరు, విద్యుత్ సమస్యలపై బీజేపీ వినతి
కొండాపురం: మండల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమంలో భాగంగా బీజేపీ కొండాపురం మండల అధ్యక్షుడు జడపల్లి మహేష్ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తూర్పు ఎర్రబల్లి పంచాయతీ పరిధిలోని ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేసవి కాలంతో సంబంధం లేకుండా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని,అధికారులు తక్షణమే స్పందించి తగిన నీటి వసతి కల్పించాలని కోరారు.
అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాల కొరత,సక్రమంగా లేని విద్యుత్ సదుపాయాల కారణంగా రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాలకు అవకాశం లేకుండా విద్యుత్ స్తంభాల పరిస్థితిని పరిశీలించి, అవసరమైన ప్రాంతాల్లో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓను కోరారు.ప్రజల మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించి, శాశ్వత పరిష్కారం చూపాలని బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు శీలం మాల్యాద్రి, కూకట్ల కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి గంగసాని మధు, కార్యదర్శులు కొండలరావు, నారాయణరావు, BJYM నాయకులు జడపల్లి నరేష్, బడుగు దర్గా బాబు, తలమంచి సునీల్ తదితరులు పాల్గొన్నారు.




