Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం!
Madanapalle: మదనపల్లె అమ్మచెరువుకు చేరిన కృష్ణా జలాలు: ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, వివరాలు వెల్లడించిన స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి.
Madanapalle: ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో తాగునీటి సమస్య పరిష్కారం!
మదనపల్లె: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కృష్ణా జలాలను శ్రీశైలం, అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా తరలిస్తున్న నేపథ్యంలో మదనపల్లె నియోజకవర్గానికి నీటిని తీసుకురావడంపై ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా ప్రత్యేక దృష్టి సారించారని స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి తెలిపారు.
మదనపల్లె ప్రాంతంలో భవిష్యత్‌లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సుమారు రూ.40 లక్షల వ్యయంతో పనులు చేపట్టి, భారీ మోటార్ల సాయంతో హంద్రీ–నీవా నీటిని అమ్మచెరువుకు తీసుకువచ్చినట్లు తెలిపారు.
అమ్మచెరువును నింపడంతో పాటు అక్కడి నుంచి నిమ్మనపల్లె ప్రాజెక్టు వరకు ఉన్న చెరువులను నీటితో నింపేలా ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. అమ్మచెరువుకు నీరు చేరడంతో చుట్టుపక్కల ఉన్న బోర్లు రీచార్జ్ అవుతున్నాయని, దీంతో కోళ్ల బైళ్ళు పంచాయతీ 1, 2, మున్సిపాలిటీ 34, 35 వార్డులతో పాటు రామారావు కాలనీ, చీకులగుట్ట, చౌడేశ్వరి నగర్, పల్లె క్రాస్, నీరుగట్టువారిపల్లె ప్రాంతాల ప్రజలకు తాగునీటి సమస్యలు తగ్గే అవకాశం ఉందన్నారు.
నీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, భవిష్యత్‌లో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని నాయకులు, కార్యకర్తలు కోరారు. అమ్మచెరువుపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక శ్రద్ధతో నిరంతరం కృషి చేయడం వల్లే పనులు వేగంగా పూర్తయ్యాయని స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి పేర్కొన్నారు.




