Kadapa: యూట్యూబర్లు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు!

Kadapa: కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యూట్యూబర్లపై డీఐజీ కోయ ప్రవీణ్ తీవ్ర హెచ్చరికలు. ఈసీ పాస్, అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి.

G. RAVI KUMAR, KADAPA
Published on: 31 Oct 2026 1:01 PM IST
Kadapa
X

Kadapa: యూట్యూబర్లు హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవు!

Kadapa: కడప నగరంతో పాటు జిల్లాలో రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మీడియా ప్రతినిధులకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద యూట్యూబ్ ఛానళ్ల పేరుతో అనవసర హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కడప ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ ప్రభుత్వ అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఎన్నికల కమిషన్ జారీ చేసిన పాస్ ఉన్న జర్నలిస్టులకు మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్దకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ మేరకు జిల్లాలోని పోలీసు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి హద్దులు దాటితే చట్టపరంగా చర్యలు తప్పవని డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA