Lakkireddypalle: వసతి గృహాలను సందర్శించిన సీపీఐ నేత శ్రీనివాసులు

Lakkireddypalle: లక్కిరెడ్డిపల్లె ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను సీపీఐ నేత సిద్దిగాళ్ల శ్రీనివాసులు సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 5 Oct 2026 11:10 PM IST
Lakkireddypalle
X

Lakkireddypalle: వసతి గృహాలను సందర్శించిన సీపీఐ నేత శ్రీనివాసులు

లక్కిరెడ్డిపల్లె: మంగళవారం రాత్రి లక్కిరెడ్డిపల్లెలోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాలను సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు సందర్శించారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలు, వసతి గృహాల్లో అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారితో మమేకమయ్యారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల కోసం సీపీఐ అండగా నిలుస్తుందని సిద్దిగాళ్ల శ్రీనివాసులు తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI