Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి బీసీలకు 34% రిజర్వేషన్‌పై బీసీ వేదిక హర్షం

Lakkireddypalli: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై లక్కిరెడ్డిపల్లిలో బీసీ వేదిక హర్షం. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్, మంత్రి మండిపల్లికి కృతజ్ఞతలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 19 Aug 2026 9:40 PM IST
Lakkireddypalli
X

Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి బీసీలకు 34% రిజర్వేషన్‌పై బీసీ వేదిక హర్షం

లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా లక్కీరెడ్డిపల్లి లో రాష్ట్ర కూటమి ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల స్థానిక బీసీ వేదిక ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి బిసి నాయకులు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు

ఈసందర్బంగా వారు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ అడుగుజాడల్లోఆనాడే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరుపున బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించి ఆదర్శప్రాయుడు అయ్యాడు , అని అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల రాజకీయ అభ్యున్నతి కోసం34%శాతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన అంశం మని అలాగే దేశంలోని అన్ని రాజకీయ పార్టీలుకూడా బిసిలకు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలలో రిజర్వేషన్లు కల్పించడానికి కృషి చేయాలి అన్నారు.

ఈకార్యక్రమంలో మండల బిసి నాయకులు యలంకూరి విజయభాస్కర్, కృష్ణ బీజేపీ సీనియర్ నాయకులు, రమణ (గురుస్వామి ) మద్దుల రామచంద్రయ్య,కులాయప్ప(,rtd ఉద్యోగి) పి.ఆంజనేయులు,చంద్రశేఖర్, జయచంద్ర నాయుడు (బీజేపీ ) బుజ్జి బాబు, బసయ్య,కే.రెడ్డెన్న,విశ్వనాధం, పీరయ్య, శ్రీరాములు,మొదలగువారు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story