Sambepalli: సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్లక్ష్యానికి లైన్‌మెన్ బలి!
Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం బుడ్డారెడ్డిగారిపల్లిలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్లక్ష్యంతో విద్యుత్ వైర్లు మరమ్మత్తులు చేస్తున్న లైన్‌మెన్ మనోహర్.
Sambepalli: సబ్‌స్టేషన్ ఆపరేటర్ నిర్లక్ష్యానికి లైన్‌మెన్ బలి!
Sambepalli: అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం బుడ్డారెడ్డిగారిపల్లి లో విషాద ఘటన చోటు చేసుకుంది. సంబేపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ సయ్యద్ అబ్జల్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైపోయింది. విద్యుత్ కార్మికుడు మనోహర్ (45) ఎల్ సి తీసుకొని బుడ్డారెడ్డిగారిపల్లె వద్ద విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ వైర్లు మరమ్మత్తులు చేస్తుండగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సబ్ స్టేషన్ ఆపరేటర్ సయ్యద్ అఫ్జల్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
దీంతో విద్యుత్ స్తంభం పైన ఉన్న మనోహర్ విద్యుత్ షాక్ కు గురై విద్యుత్ స్తంభం పై వేలాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు మృతదేహాన్ని క్రిందకు దించడానికి నిరాకరిస్తూ విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ సయ్యద్ అఫ్జల్ నిర్లక్ష్యంతోనే మనోహర్ చనిపోయాడు అంటూ కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు కలిసి చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి పై బైఠాయించి మనోహర్ కుటుంబానికి న్యాయం చేయాలని చేయాలంటూ ధర్నాకు దిగారు.
మనోహర్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించబోమని దళిత సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.




