Proddatur: పూరీ కర్రీలో బల్లి..టిఫిన్ సెంటర్ సీజ్, వంట మాస్టర్‌పై కేసు!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరు గణేష్ టిఫిన్ సెంటర్‌లో పూరీ కర్రీలో బల్లి ప్రత్యక్షం. హోటల్ సీజ్ చేసిన పోలీసులు, వంట మాస్టర్‌పై కేసు నమోదు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 25 July 2026 8:16 AM IST
Proddatur
X

Proddatur: పూరీ కర్రీలో బల్లి..టిఫిన్ సెంటర్ సీజ్, వంట మాస్టర్‌పై కేసు!

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో గణేష్ టిఫిన్ సెంటర్‌లో ఆహార భద్రతపై ప్రశ్నలు తలెత్తే ఘటన చోటుచేసుకుంది. పూరీతో పాటు ఇచ్చిన కర్రీలో బల్లి కనిపించడంతో వినియోగదారుడు పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు స్పందించి టిఫిన్ సెంటర్‌ను తాత్కాలికంగా మూయించారు. ప్రొద్దుటూరులోని రామేశ్వరం రోడ్డులో ఉన్న గణేష్ టిఫిన్ సెంటర్‌లో విక్రయించిన పూరీ కర్రీలో బల్లి కనిపించడం కలకలం రేపింది.

షేక్ ముస్తఫా అనే యువకుడు ఉదయం పూరీ పార్సల్ తీసుకుని ఇంటికి వెళ్లిన తర్వాత కర్రీని తెరిచి చూడగా అందులో బల్లి కనిపించినట్లు తెలిపాడు. వెంటనే కర్రీ పార్సల్‌తో టిఫిన్ సెంటర్‌కు వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించగా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించాడు. దీంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కొండారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని టిఫిన్ సెంటర్‌ను తాత్కాలికంగా మూయించి, హోటల్ వంట మాస్టర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story