Kadapa: కడప జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం - పంటలను ధ్వంసం చేసిన వైనం!
Kadapa: కడప జిల్లా మాచిరెడ్డిగారి పల్లె, రాయవరం ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు హల్‌చల్. పొలాలను పాడు చేయడంతో తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు.
Kadapa: కడప జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం - పంటలను ధ్వంసం చేసిన వైనం!
Kadapa: కడప జిల్లాలో ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. మాచిరెడ్డిగారి పల్లె, రాయవరంలోని పొలాలను ఏనుగు పాడు చేస్తూ బీభత్సం సృస్టించింది. గత రెండు నెలల క్రితం ఇదే తరహాలో ఏనుగులు గుంపు పంట పొలాలపై దాడి చేసిందని గుర్తు చేశారు.
చేతికి వచ్చిన పంటలను ఏనుగులు విధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏనుగుల బెడద నుంచి తమ పొలాలను, గ్రామాలను రక్షించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.




