Madanapalle: అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల మహాసభలు.. మంత్రులకు సాదర ఆహ్వానం!
Madanapalle: ఈ నెల 23న నిర్వహించనున్న APWJF, APBJA జర్నలిస్టుల జిల్లా మహాసభలకు హాజరుకావాలని రాష్ట్ర మంత్రులుకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా జర్నలిస్టుల మహాసభలు.. మంత్రులకు సాదర ఆహ్వానం!
అన్నమయ్య జిల్లా, మదనపల్లె, ఆగస్టు 3: ఈ నెల 23వ తేదీన మదనపల్లెలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (APWJF), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టు అసోసియేషన్ (APBJA) సంయుక్త ఆధ్వర్యంలోని అన్నమయ్య జిల్లా మహాసభలకు రాష్ట్ర మంత్రులను జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం పడమటికోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఆయన స్వగృహంలో కలిసి మహాసభలకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
అనంతరం నంద్యాల జిల్లా బనగానిపల్లిలో అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కూడా ఆయన నివాసంలో కలిసి మహాసభలకు విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ఇన్‌చార్జ్ కే. జయరాజ్, APWJF జిల్లా అధ్యక్షుడు రమేష్ రాయల్, జిల్లా ప్రధాన కార్యదర్శి హిదాయతుల్లా (అప్పా), APBJA జిల్లా అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్,
జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, నంద్యాల జిల్లా కన్వీనర్ మద్దయ్య యాదవ్, ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు షేక్ సలీం బాషా, శ్రీనివాసులు నాయుడు, జాకీర్ హుస్సేన్, మంజునాథ్, బనగానిపల్లె నియోజకవర్గ కార్యదర్శి షాషావలి, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు ఆది నారాయణ, రవిరాజ్, షేక్ అస్లాం, నవాజ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులందరూ సంఘీభావంతో పాల్గొనాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు.




