Madanapalle: బాలికలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి: డీఎస్పీ బుచ్చిరాజు!
Madanapalle: మదనపల్లెలో 'రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా ప్రశిక్షణ': బాలికలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని డీఎస్పీ బుచ్చిరాజు పిలుపు, 228 పాఠశాలల్లో 30 సెషన్ల శిక్షణ ప్రారంభం.
Madanapalle: బాలికలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి: డీఎస్పీ బుచ్చిరాజు!
మదనపల్లె: రాణి లక్ష్మీబాయి స్ఫూర్తితో బాలికలు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని డీఎస్పీ బుచ్చిరాజు పిలుపునిచ్చారు. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షా ప్రశిక్షణ కార్యక్రమాన్ని మదనపల్లె బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని 228 పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి బాలికలకు నాలుగు నెలల పాటు 30 సెషన్ల శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈవో సుబ్రహ్మణ్యం, ఏపీసీ అనూరాధ పాల్గొన్నారు.




