Madanapalle: మదనపల్లె కురువంకలో పల్స్ పోలియో.. చుక్కలు వేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురువంక గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది.

Srinivasulu, Madanapalle
Published on: 28 Jun 2026 1:31 PM IST
Madanapalle: మదనపల్లె కురువంకలో పల్స్ పోలియో.. చుక్కలు వేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి!
X

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం కురువంక గ్రామంలో నిర్వహించిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమంలో కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ నాగరాజు,వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story