Madanapalle: నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం జరపాలి: సీఐ చాంద్ బాషా!
Madanapalle: నియమ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: మదనపల్లె ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా. ఊరేగింపులో అప్రమత్తత, చిన్నారుల రక్షణపై తల్లిదండ్రులకు కీలక సూచనలు.
Madanapalle: నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనం జరపాలి: సీఐ చాంద్ బాషా!
మదనపల్లె: గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు పోలీసుల సూచనలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మదనపల్లె ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా సూచించారు. నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ సందర్భంగా చాంద్ బాషా మాట్లాడుతూ.. నిమజ్జనం సమయంలో ఎక్కడా అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భక్తులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా పిల్లలను నిమజ్జన ప్రాంతాలకు తీసుకెళ్లే సమయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
నీటి ప్రాంతాలు, వాహనాల రాకపోకలు, జనసమ్మర్థం వద్ద పిల్లలు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ఊరేగింపులో పాల్గొనే భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.




