Madanapalle: స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సాయం!

Madanapalle: మదనపల్లె ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి తక్షణ సాయం అందించి మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా, పోలీస్ సిబ్బంది.

Srinivasulu, Madanapalle
Updated on: 21 Sept 2026 4:41 PM IST
Madanapalle
X

Madanapalle: స్పృహతప్పి పడిపోయిన వ్యక్తికి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సాయం!

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని ఎంఎస్‌ఆర్ సర్కిల్ వద్ద సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ తప్పి కిందపడిపోయాడు. గమనించిన ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ చాంద్ బాషా, తన డ్రైవర్, వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ సతీశ్‌తో కలిసి వెంటనే స్పందించారు.

కిందపడిన వ్యక్తి ముఖంపై నీళ్లు చల్లి స్పృహలోకి తీసుకువచ్చి, ఎలాంటి ప్రమాదం జరగకుండా పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అనంతరం అతని పేరు, చిరునామా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కొద్దిసేపటికి తేరుకున్న వ్యక్తి స్వయంగా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా సీఐ చాంద్ బాషా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించినట్లుగా ప్రమాద పరిస్థితుల్లో ఉన్న వారికి ముందుగా సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మానవత్వంతో స్పందించి ఆ వ్యక్తికి సహాయం చేశామని తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle