Badvel: బద్వేల్‌లో టీడీపీలోకి భారీ చేరికలు: 65 కుటుంబాలు చేరిక
Badvel: బద్వేల్ మున్సిపాలిటీ 33వ వార్డులో వైఎస్సార్‌సీపీని వీడి 65 కుటుంబాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి.
Badvel: బద్వేల్‌లో టీడీపీలోకి భారీ చేరికలు: 65 కుటుంబాలు చేరిక
బద్వేల్: బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు గాండ్లవీధి, యాదవ్ నగర్ ప్రాంతానికి చెందిన 65 కుటుంబాలు వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.
బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆదివారం ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీలో చేరిన వారికి సూర్యనారాయణ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి పాలన, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీ నుండి పెద్ద ఎత్తున టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. బద్వేల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
కొత్తగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ, టీడీపీ అభివృద్ధిని చూసే పార్టీలో చేరామని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




