Rayachoty: జాతీయ ఆహార నూనెల మిషన్ కార్యక్రమంలో మండిపల్లి హరితమ్మ!

Rayachoty: చిన్నమండెం మండలం బోనుమల గ్రామంలో జాతీయ ఆహార నూనెల మిషన్ (NMEO-OS) కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి హరితమ్మ.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 24 July 2026 11:46 PM IST
Rayachoty
X

Rayachoty: జాతీయ ఆహార నూనెల మిషన్ కార్యక్రమంలో మండిపల్లి హరితమ్మ!

Rayachoty: జాతీయ ఆహార నూనెల మిషన్ (NMEO-OS) కార్యక్రమంలో పాల్గొన్న మండిపల్లి హరితమ్మ గారు చిన్నమండెం మండలం బోనుమల గ్రామంలో నిర్వహించిన జాతీయ ఆహార నూనెల మిషన్ – నూనె గింజలు (NMEO-OS) సామూహిక ప్రదర్శన కేంద్రం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి మండిపల్లి హరితమ్మ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన కేంద్రాన్ని పరిశీలించి, రైతులతో ఆప్యాయంగా ముచ్చటించారు. నూనె గింజల సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల అధ్యక్షుడు మూగి రెడ్డప్ప,పెద్దిరెడ్డి,బోనుమల గ్రామ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story