Chinnamandem: కూతలవాండ్లపల్లిలో రెడ్డి చెరువు అభివృద్ధి పనులు!
Chinnamandem: అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం కూతలవాండ్లపల్లిలో రెడ్డి చెరువు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ.
Chinnamandem: కూతలవాండ్లపల్లిలో రెడ్డి చెరువు అభివృద్ధి పనులు!
Chinnamandem: అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం కూతలవాండ్లపల్లి గ్రామంలోని రెడ్డి చెరువు అభివృద్ధి పనులకు యువజన & క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి శ్రీమతి మండిపల్లి హరితమ్మ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా హరితమ్మ గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పరిరక్షించడం, రైతులకు సాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరచడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చెరువుల అభివృద్ధి పనులు పూర్తయితే వర్షపు నీటి నిల్వ పెరిగి భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో పాటు రైతాంగానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ, సంక్షేమం–అభివృద్ధి రెండింటికీ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మూగి రెడ్డప్ప స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.




