Rayachoty: రాయచోటిలో 49 మందికి రూ.47 లక్షల CMRF చెక్కుల పంపిణీ!
Rayachoty: రాయచోటి టీడీపీ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ. 47 లక్షల CMRF చెక్కులు పంపిణీ చేసిన మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. పేదలకు అండగా సీఎం పాలన.
Rayachoty: రాయచోటిలో 49 మందికి రూ.47 లక్షల CMRF చెక్కుల పంపిణీ!
Rayachoty: రాయచోటి నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు 49 మంది లబ్ధిదారులకు సుమారు రూ.47 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. అనారోగ్యం, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసా కల్పిస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




