Rayachoti: రాయచోటిలో బీసీ హాస్టల్ విద్యార్థులకు పరుపులు, దిండ్లు అందజేత!

Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటిలోని బీసీ కాలేజ్ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2.50 లక్షల విలువైన పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లను పంపిణీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 10 Oct 2026 7:55 AM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటిలో బీసీ హాస్టల్ విద్యార్థులకు పరుపులు, దిండ్లు అందజేత!

Rayachoti: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని బీసీ కాలేజ్ బాలుర వసతి గృహంలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2.50 లక్షల విలువైన పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లను పంపిణీ చేశారు.

ఇటీవల రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదినం సందర్భంగా బీసీ కాలేజ్ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు అవసరమైన పరుపులు, దిండ్లు, బెడ్‌షీట్లు అందించాలని కోరగా, వారి విజ్ఞప్తి మేరకు మండిపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ఈ కార్యక్రమానికి ముందుకొచ్చింది.

ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించిన వస్తువులను హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులతో కలిసి నియోజకవర్గ టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తమ వంతు సహకారంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

సమాజం పట్ల సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్య ఎంతో కీలకమని, విద్యారంగంలో కూటమి ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.విద్యార్థుల అవసరాలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI