Rayachoti: గాలివీడులో ఎన్టీఆర్ పార్క్ పనుల పరిశీలన మంత్రి మండిపల్లి!
Rayachoti: గాలివీడులో రూ.1.10 కోట్లతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ పార్క్ పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించి టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
Rayachoti: గాలివీడులో ఎన్టీఆర్ పార్క్ పనుల పరిశీలన మంత్రి మండిపల్లి!
Rayachoti: గాలివీడు మండల పర్యటనలో భాగంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. గాలివీడు పట్టణ కేంద్రంలోని గేట్ సర్కిల్ సమీపంలో పెద్ద చెరువు కట్టను ఆనుకొని దాదాపు రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ చిల్డ్రన్స్ పార్క్ పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పిల్లలకు ఆహ్లాదకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేలా పార్క్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయించి పార్క్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. గాలివీడు పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు డాక్టర్ మండిపల్లె లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మంత్రి వెంట ఉండి పార్క్ పనులను పరిశీలించారు. గాలివీడు పట్టణానికి మరింత ఆకర్షణగా నిలిచేలా ఎన్టీఆర్ మెమోరియల్ పార్క్‌ను అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు.
అనంతరం గాలివీడు పట్టణంలోని గేట్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, బూతు క్లస్టర్ ఇన్చార్జిలు,కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.




