Rayachoti: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoti: రాయచోటి నియోజకవర్గం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
Rayachoti: మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్!
Rayachoti: చిన్నమండెం మండలం బోరెడ్డిగారి పల్లెలోని తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.
నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సత్కారం ఇదే సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి శాలువా కప్పి సత్కరించారు. తనకు ఎంపీటీసీగా అవకాశం కల్పించడంతో పాటు, ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించినందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




