Chinnamandem: కేసాపురంలో సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన!

Chinnamandem: చిన్నమండెం మండలం కేసాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు సభకు వచ్చే శ్రేణుల కోసం ఏర్పాటు చేస్తున్న భోజన స్థలాన్ని మౌర్య రెడ్డి పరిశీలించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 30 Sept 2026 4:21 PM IST
Chinnamandem
X

Chinnamandem: కేసాపురంలో సీఎం చంద్రబాబు సభ ఏర్పాట్ల పరిశీలన!

Chinnamandem: చిన్నమండెం మండలం కేసాపురం సమీపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సభకు హాజరయ్యే నాయకులు, కార్యకర్తల కోసం ఏర్పాటు చేయనున్న భోజన ఏర్పాట్ల స్థలాన్ని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మేనల్లుడు మౌర్య రెడ్డి గారు పరిశీలించారు.

సీఎం సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భోజన ఏర్పాట్లకు అనువైన ప్రదేశం, వసతులు, ఇతర అవసరాలపై సంబంధిత నిర్వాహకులతో మౌర్య రెడ్డి చర్చించారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.

సీఎం సభను విజయవంతం చేసే దిశగా ప్రతి ఏర్పాటును సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI