Madanapalle; మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత.. బాధితుల ఆవేదన!

Madanapalle: ప్రభుత్వ బోధనా ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రమైంది. కుక్కకాటు బాధితుడికి టీటీ ఇంజెక్షన్ కూడా లేకపోవడం, నర్సుల నిర్లక్ష్యంపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 14 Sept 2026 9:33 PM IST
Madanapalle
X

Madanapalle; మదనపల్లె ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత.. బాధితుల ఆవేదన!

అన్నమయ్య జిల్లా మదనపల్లె: మదనపల్లె ప్రభుత్వ సర్వ బోధన ఆసుపత్రిలో కనీస మందులు కూడా అందుబాటులో లేవని రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కుక్కకాటుతో ఆసుపత్రికి వచ్చిన బాధితుడు బయట నుంచి టి.టి. ఇంజక్షన్ తీసుకువచ్చినా నర్సులు నిర్లక్ష్యంగా స్పందించారని బంధువులు ఆరోపించారు.

“పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే మందులు లేకపోతే ఎలా?” అంటూ వారు ప్రశ్నించారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి మందుల కొరతను నివారించాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle