Kadapa: పెద్దపసుపుల గ్రామంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!

Kadapa: పెద్దముడియం పరిధిలోని పెద్దపసుపుల గ్రామంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్. స్థానిక ఎన్నికలు, పండుగల నేపథ్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 13 Sept 2026 10:20 AM IST
Kadapa
X

Kadapa: పెద్దపసుపుల గ్రామంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్!

Kadapa: పెద్దముడియం పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దపసుపుల గ్రామంలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పండుగల నేపథ్యంలో విస్తృత తనిఖీలు గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు చేపట్టారు.

గ్రామ వీధుల్లో పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతపై భరోసా కల్పించారు. మహిళల భద్రతకు సంబంధించిన శక్తి యాప్, హెల్ప్‌లైన్లు మరియు పోలీసు సేవలపై మహిళలు, ప్రజలకు అవగాహన కల్పించారు.

కొత్త క్రిమినల్ చట్టాలు, సైబర్ నేరాలు, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడంపై ప్రజలకు సూచనలు చేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పండుగల నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని సూచించారు.

గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్, ఫ్లాగ్ మార్చ్, ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU