Kothapalli: శ్రీనివాస కల్యాణ మహోత్సవం పాల్గొన్న మంత్రి మండిపల్లి దంపతులు
Kothapalli: కొత్తపల్లి శ్రీ మల్లూరమ్మ ఆలయంలో శ్రీనివాస కల్యాణం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొని పూజలు చేశారు.
Kothapalli: శ్రీనివాస కల్యాణ మహోత్సవం పాల్గొన్న మంత్రి మండిపల్లి దంపతులు
Kothapalli: చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ మల్లూరమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ మహోత్సవాన్ని తిలకించారు.
శ్రీనివాస స్వామివారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
మంత్రి దంపతులకు ఆలయ నిర్వాహకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులతో కలిసి మంత్రి దంపతులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించడం కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
శ్రీనివాస కళ్యాణం అనంతరం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం మంత్రి కుమారుడు మండపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు ప్రారంభించి తన చేతులతో భక్తులకు వడ్డించారు. ప్రజలందరి ఇళ్లలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, శ్రీనివాస స్వామివారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు.




