Rayachoti: రాయచోటి అభివృద్ధికి కొత్త అధ్యాయం: మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి విద్య, మైనారిటీ సంక్షేమం, వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.

RAMESH KUMAR RAJU, ROYCHOTI
Published on: 29 July 2026 2:26 PM IST
Rayachoti
X

Rayachoti: రాయచోటి అభివృద్ధికి కొత్త అధ్యాయం: మంత్రి మండిపల్లి! 

అన్నమయ్య జిల్లా రాయచోటి :

రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన సమస్యలను ఒక్కొక్కటిగా గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.

గతంలో అభివృద్ధి పేరుతో మాటలు వినిపించేవి... నేడు అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. గతంలో హామీలు మాత్రమే ఉండేవి... నేడు నిధులు, పరిపాలనా అనుమతులు, నిర్మాణ పనులు, పూర్తవుతున్న ప్రాజెక్టులు ప్రజల కళ్లముందు కనిపిస్తున్నాయి అని మంత్రి పేర్కొన్నారు.

రాయచోటి నియోజకవర్గంలోని ప్రతి వర్గానికి మెరుగైన విద్య, నాణ్యమైన వసతి, అవసరమైన మౌలిక సదుపాయాలు అందేలా వివిధ శాఖల ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. బాలికల విద్య నుంచి మైనారిటీ విద్యార్థుల సంక్షేమం వరకు, గురుకులాల అభివృద్ధి నుంచి బీసీ విద్యార్థుల వసతి గృహాల వరకు అన్ని వర్గాలను కలుపుకొని సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

అభివృద్ధి అంటే ప్రకటనలు కాదు... ప్రజలకు అందే ఫలితాలు. అభివృద్ధి అంటే శిలాఫలకాలు కాదు... విద్యార్థుల భవిష్యత్తును మార్చే విద్యా సంస్థలు అని మంత్రి స్పష్టం చేశారు.

విద్యా రంగంలో రూ.12.20 కోట్లతో కొత్త అధ్యాయం

రాయచోటి నియోజకవర్గంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను అప్‌గ్రేడ్ జూనియర్ కళాశాలలుగా అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.12.20 కోట్ల విలువైన పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ విద్యాభివృద్ధి దృక్పథానికి నిదర్శనమని మంత్రి తెలిపారు.

రామాపురం, ఎల్.ఆర్.పల్లి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, రాయచోటి ప్రాంతాల్లో బాలికలకు ఉన్నత విద్యకు అవసరమైన మౌలిక వసతులు కల్పించే పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాయచోటి కేజీబీవీలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రయోగశాలల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంత బాలికలకు నాణ్యమైన విద్యా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

బాలికల చదువుకు అడ్డంకులు ఉండకూడదు... ఉన్నత విద్యకు అవకాశాలు అందరికీ చేరాలి... ఇదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అన్నారు.

పాఠశాలల్లో మౌలిక వసతులకు పెద్దపీట

రాయచోటి నియోజకవర్గంలోని పాఠశాలల్లో తాగునీరు, విద్యుదీకరణ, మరుగుదొడ్లు, దివ్యాంగులకు అనుకూలమైన ర్యాంపులు, హ్యాండ్‌రైల్స్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి తెలిపారు.

2025–26 సంవత్సరంలోనే సమగ్ర శిక్షా పథకం కింద రాయచోటి నియోజకవర్గంలో 26 అభివృద్ధి పనులకు సుమారు రూ.1.98 కోట్ల అంచనా వ్యయం కేటాయించగా, ఇప్పటికే సుమారు రూ.74.37 లక్షల మేర పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఐదు పనులు పూర్తికాగా, మిగిలిన పనులు వేగంగా పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

ఇది కేవలం గణాంకం కాదు... వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాది. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు... రాయచోటి భవిష్యత్తు నిర్మాణం అని మంత్రి పేర్కొన్నారు.

వైకాపా పాలనలో పునాదులకే పరిమితమైన నిర్మాణాలు... కూటమి పాలనలో పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్న అభివృద్ధి

రాయచోటి నియోజకవర్గంలో మైనారిటీ, గురుకుల విద్యా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ స్పష్టమైన మార్పును తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు.

గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన మైనారిటీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణాలు పునాదుల దశలోనే నిలిచిపోయి, ఏళ్ల తరబడి పురోగతి లేకుండా ఉండిపోయాయని పేర్కొన్నారు. నిర్మాణాలు నిలిచిపోయినా, విద్యార్థుల భవిష్యత్తు గురించి గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెండింగ్‌లో ఉన్న ఈ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చొరవతో అవసరమైన నిధులను సమకూర్చి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.

గత పాలనలో పునాదుల వద్దే ఆగిపోయిన నిర్మాణాలకు... కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి పోసింది. గతంలో నిలిచిపోయిన పనులకు... నేడు వేగం వచ్చింది. గతంలో కనిపించిన నిర్లక్ష్యానికి... నేడు అభివృద్ధి సమాధానం చెబుతోంది అని మంత్రి పేర్కొన్నారు.

మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భద్రతా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో రాయచోటి పట్టణంలో రెండు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ఒక్కొక్కటికి రూ.18 కోట్ల చొప్పున, మొత్తం రూ.36 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు చేపట్టడం సమగ్ర అభివృద్ధి దృక్పథానికి నిదర్శనమని తెలిపారు.

విద్య, వసతి, భద్రత అనే మూడు కీలక అంశాలను సమన్వయం చేస్తూ మైనారిటీ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించి, వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనే సంకల్పంతో ఈ నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.

మైనారిటీ సంక్షేమం అంటే కేవలం హామీలు కాదు... విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన శాశ్వత వసతులు కల్పించడమే నిజమైన సంక్షేమం అని మంత్రి తెలిపారు.

గురుకులాల అభివృద్ధికి రూ.30 లక్షల పనులు

రామాపురం, సంబేపల్లి ప్రాంతాల్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులాల్లో వంటశాలలు, బోర్‌వెల్‌లు, నీటి నిల్వ సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్యుదీకరణ, డ్రైనేజీ తదితర మౌలిక వసతుల మెరుగుదలకు పనులు చేపట్టామని మంత్రి తెలిపారు.

మూడు గురుకులాల్లో ఒక్కొక్కటి రూ.10 లక్షల చొప్పున, మొత్తం రూ.30 లక్షల విలువైన పనులు చేపట్టడం ద్వారా విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ స్పష్టమవుతోందన్నారు.

గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థికి మెరుగైన వసతులు అందాలి... వారి చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు... ఇదే ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు.

బీసీ విద్యార్థుల వసతి గృహాలకూ సమాన ప్రాధాన్యత

గాలివీడు, ఎల్.ఆర్.పల్లి, రాయచోటి ప్రాంతాల్లోని బీసీ వసతి గృహాల్లో మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు, తలుపులు, కిటికీలు, విద్యుదీకరణ వంటి మౌలిక వసతుల పనులకు నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు.

విద్యార్థుల వసతి గృహాలను కేవలం భవనాలుగా కాకుండా... వారి భవిష్యత్తుకు బలమైన పునాదులుగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.

అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా మంజూరు చేసిన 10 మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక బాలుర పాఠశాలను అన్నమయ్య జిల్లా రాయచోటికి మంజూరు చేయించడం నియోజకవర్గానికి లభించిన మరో విశిష్ట విజయమని మంత్రి తెలిపారు.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిరంతర కృషితో పాఠశాల మంజూరు మాత్రమే కాకుండా, విద్యార్థుల చదువులకు ఎలాంటి అంతరాయం కలగకుండా శాశ్వత భవనం పూర్తయ్యే వరకు ప్రభుత్వ మైనారిటీ బాలికల వసతి గృహ భవనాన్ని తాత్కాలికంగా కేటాయించి, 2026–27 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

అలాగే పాఠశాల ప్రారంభానికి అవసరమైన ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాల కోసం సుమారు రూ.13 లక్షల విలువైన సదుపాయాలు కల్పించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వ నిబద్ధతను మరోసారి చాటామని తెలిపారు.

పాఠశాల మంజూరు చేయడం ఒక అడుగు అయితే... విద్యార్థులు చదువుకునేలా అన్ని వసతులు కల్పించి తరగతులు ప్రారంభించడం పూర్తి స్థాయి బాధ్యత. ఆ బాధ్యతను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది అని మంత్రి పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే అన్ని వర్గాల అభివృద్ధి

బాలికల విద్య నుంచి మైనారిటీ విద్యార్థుల సంక్షేమం వరకు... బీసీ విద్యార్థుల వసతి గృహాల నుంచి గురుకులాల మౌలిక వసతుల వరకు... రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

అభివృద్ధి కొందరికే పరిమితం కాకూడదు... ప్రతి వర్గానికి చేరాలి. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకూడదు... ప్రతి మండలానికి విస్తరించాలి. సంక్షేమం కొందరికే కాదు... ప్రతి కుటుంబానికి అందాలి అని మంత్రి స్పష్టం చేశారు.

రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కార దిశగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు.

గతంలో అభివృద్ధి పేరుతో మాటలు వినిపించేవని, ఇప్పుడు అదే అభివృద్ధి పనుల రూపంలో క్షేత్రస్థాయిలో కనిపిస్తోందన్నారు. గతంలో హామీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు నిధులు, పరిపాలనా అనుమతులు, నిర్మాణ పనులు, విద్యా సంస్థల ప్రారంభం వరకు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

RAMESH KUMAR RAJU, ROYCHOTI

RAMESH KUMAR RAJU, ROYCHOTI

Next Story