Rayachoti: సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: చిన్నమండెం మండలం శ్రీనివాసపురంలో రూ.50 లక్షలతో పల్లె పండుగ-3.0 కింద సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Rayachoti: సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: చిన్నమండెం మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమం కింద చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రారంభించారు.
శ్రీనివాసపురం నుంచి పాతవట్టంవాండ్లపల్లి వరకు రూ.40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి గారు శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీనివాసపురంలో ఎంపీపీ పాఠశాల నుంచి సాయిరాం ఇంటి వరకు, ఇతర ప్రాంతాల్లో రూ.10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. పల్లె పండుగ–3.0 ద్వారా గ్రామాల అవసరాలకు అనుగుణంగా రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
శ్రీనివాసపురం–పాతవట్టంవాండ్లపల్లి రహదారి నిర్మాణంతో పాటు శ్రీనివాసపురంలోని అంతర్గత సీసీ రోడ్ల అభివృద్ధి ద్వారా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




