KV Palle: టీడీపీ సీనియర్ నేత రఘురామిరెడ్డి మృతికి మంత్రి మండిపల్లి సంతాపం

KV Palle: కె.వి. పల్లె మండలం తిమ్మాపురం టీడీపీ సీనియర్ నాయకులు రఘురామిరెడ్డి మృతి పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం సంతాపం తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 18 Nov 2026 9:22 PM IST
KV Palle
X

KV Palle: టీడీపీ సీనియర్ నేత రఘురామిరెడ్డి మృతికి మంత్రి మండిపల్లి సంతాపం

KV Palle: కె.వి. పల్లె మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రఘురామిరెడ్డి గారు గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీకి సీనియర్ నాయకుడిగా రఘురామిరెడ్డి గారు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి మరణం పార్టీకి, కుటుంబ సభ్యులకు తీరని లోటని పేర్కొంటూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.

రఘురామిరెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI