Rayachoti: గొల్లపల్లె శ్రీకృష్ణుడి ఆలయంలో మంత్రి మండిపల్లి ప్రత్యేక పూజలు!
Rayachoti: రాయచోటి లక్కిరెడ్డిపల్లె రింగ్ రోడ్డు గొల్లపల్లె శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి మండిపల్లి.
Rayachoti: గొల్లపల్లె శ్రీకృష్ణుడి ఆలయంలో మంత్రి మండిపల్లి ప్రత్యేక పూజలు!
Rayachoti: శ్రీ కృష్ణాష్టమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి మండిపల్లి, అన్నమయ్య జిల్లా రాయచోటి లక్కిరెడ్డిపల్లె రింగ్ రోడ్డు దగ్గర గొల్లపల్లె లో శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకొని శ్రీకృష్ణుడి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గారు శ్రీకృష్ణుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Next Story




