Lakkireddypalli: అభివృద్ధి పథంలో లక్కిరెడ్డిపల్లి ఏపీ మోడల్ స్కూల్!

Lakkireddypalli: లక్కిరెడ్డిపల్లి ఏపీ మోడల్ స్కూల్ లో రూ. 10 లక్షల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నిధులతో తాగునీటి ప్లాంట్, సిమెంట్ రోడ్ల పనులు పూర్తయ్యాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 July 2026 8:14 PM IST
Lakkireddypalli
X

Lakkireddypalli: అభివృద్ధి పథంలో లక్కిరెడ్డిపల్లి ఏపీ మోడల్ స్కూల్!

లక్కిరెడ్డిపల్లె: లక్కిరెడ్డిపల్లి మండలంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. విద్యార్థుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

గత సంవత్సరం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ సమావేశానికి గౌరవ మంత్రి గారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు మరియు మండల అధ్యక్షులు శ్రీ యనమల మదన్మోహన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు.

ప్రధానంగా పాఠశాల బస్సు సమయాల సమస్య, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, పాఠశాల ఆవరణలో సిమెంట్ ఫ్లోరింగ్, విద్యార్థులు సురక్షితంగా నడిచేందుకు సిమెంట్ రోడ్డు నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఈ సమస్యలను డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి గారు, విద్యార్థుల సౌకర్యార్థం రూ.10 లక్షలకు పైగా నిధులను కేటాయించి, అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చేయించారు.

విద్యార్థుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపిన మంత్రి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story