Rayachoti: హార్విక్ మొదటి జన్మదిన వేడుకలు.. చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి!

Rayachoti: రాయచోటి పీసీఆర్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన చిన్నారి హార్విక్ మొదటి జన్మదిన వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 8 Nov 2026 3:36 PM IST
Rayachoti
X

Rayachoti: హార్విక్ మొదటి జన్మదిన వేడుకలు.. చిన్నారిని ఆశీర్వదించిన మంత్రి మండిపల్లి!

రాయచోటి: రాయచోటి–మదనపల్లె ప్రధాన రహదారిలోని PCR కన్వెన్షన్ హాల్లో దేవగుడిపల్లికి చెందిన మదన్ మోహన్ రెడ్డి మనవడు కాళేశ్వర్ – హర్షిత దంపతుల కుమారుడు హార్విక్ మొదటి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పాల్గొని చిన్నారి హార్విక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI