Annamayya: అశోక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Annamayya: మృతి చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్ నడింపల్లి అశోక్ కుటుంబాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి ధైర్యం చెప్పారు.
Annamayya: అశోక్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య: ఇటీవల వండాడి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇంచార్జ్, మండిపల్లి కుటుంబానికి వీరాభిమాని నడింపల్లి అశోక్ కుటుంబాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడల శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరామర్శించారు.
అశోక్ స్వగృహానికి వెళ్లిన మంత్రి గారు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పరామర్శించి, వారి బాధను పంచుకుని ధైర్యం చెప్పారు.
ఈ విషాద సమయంలో అశోక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని,కుటుంబాన్ని ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని మంత్రి గారు భరోసా కల్పించారు.
అశోక్ మృతి పార్టీకి, మండిపల్లి కుటుంబ అభిమానులకు తీరని లోటని పేర్కొంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా.. మండిపల్లి కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుంది.




