Rayachoti: రఫీ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి మండిపల్లి!
Rayachoti: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ రఫీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శ కుటుంబానికి భరోసా.
Rayachoti: రఫీ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి మండిపల్లి!
రాయచోటి: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న లొంబాడా రఫీ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రఫీ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.




