Rayachoti: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి!
Rayachoti: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుభాకాంక్షలు తెలుపుతూ జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలన్నారు.
Rayachoti: శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి మండిపల్లి!
Rayachoti: శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు. కష్టాల్లో ఉన్నవారికి కొండంత ధైర్యం, అనిశ్చితిలో ఉన్నవారికి సరైన దిశ, భయాల్లో ఉన్నవారికి ఆత్మవిశ్వాసం అందించే స్ఫూర్తి శ్రీకృష్ణ తత్వంలో ఉందన్నారు.
కృష్ణుడు చూపిన ధర్మమార్గం.. గీత అందించిన కర్తవ్యబోధ.. సమాజానికి శాంతి, సామరస్యాలకు శాశ్వత మార్గదర్శకాలు అని తెలిపారు.ఈ పవిత్ర జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఇంటా ఆనందం వెల్లివిరియాలని, ప్రజల జీవితాల్లో శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షిస్తూ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




