Rayachoti: వీరభద్రుని సన్నిధిలో నిశ్చితార్థం.. హాజరైన మంత్రి కుటుంబం!

Rayachoti: శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన నిశ్చితార్థ వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 7 Sept 2026 4:29 PM IST
Rayachoti
X

Rayachoti: వీరభద్రుని సన్నిధిలో నిశ్చితార్థం.. హాజరైన మంత్రి కుటుంబం!

రాయచోటి: రాయచోటి నియోజకవర్గంలోని వీరభద్ర స్వామి ఆలయంలో జరిగిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి అనుచరుడు రాజు గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో మంత్రి గారి సతీమణి హరితమ్మ గారు, మేనల్లుడు మౌర్యా రెడ్డి గారు, కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం మంత్రి గారి సతీమణి హరితమ్మ గారు, మేనల్లుడు మౌర్యా రెడ్డి గారు, కుమారుడు మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి గారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయానికి విచ్చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story