Chinnamandem: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్

Chinnamandem: చిన్నమండెం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 1 July 2026 2:40 PM IST
Chinnamandem
X

Chinnamandem: బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్

చిన్నమండెం: ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలోని తన నివాసం వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రజా దర్బార్ కు తరలివచ్చి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి అర్జీలు అందజేసి వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు. ప్రజా దర్బార్ లో వచ్చే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను కోరారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story