Rayachoti: రాయచోటి ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్
Rayachoti: రాయచోటి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. సమస్యల పరిష్కారానికి అధికారులకు కఠిన ఆదేశాలు.
Rayachoti: రాయచోటి ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి రాంప్రసాద్
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలొని క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత సమయంలోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
తహసిల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.రాబోయే కరువును దృష్టిలో పెట్టుకొని వేసవిలో నీటి ఏద్దడిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వము అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రాయచోటి నియోజకవర్గంలోని చెరువులకు జలధార కింద కాలువల మరమ్మతు పనులు వెంటనే చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఎక్కడ అవినీతి లేకుండా పారదర్శకంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ప్రభుత్వం పని దినాలు కల్పించి ఆదుకోవడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..




