Rayachoty: ప్రజల వద్దకే మంత్రి స్వయంగా అర్జీలు స్వీకరించిన రాంప్రసాద్!

Rayachoty: అన్నమయ్య చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్. అర్జీలు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 27 Sept 2026 10:36 AM IST
Rayachoty
X

Rayachoty: ప్రజల వద్దకే మంత్రి స్వయంగా అర్జీలు స్వీకరించిన రాంప్రసాద్!

Rayachoty: చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన సొంత నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ప్రజాదర్బార్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి గారు ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలను, వినతులను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు అందించిన అర్జీలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ప్రజాదర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI